బ్జడెట్‌లో రెండు రాష్టాల్రకు అన్యాయం :నారాయణమూర్తి

నల్గొండ,మార్చి3(జ‌నంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్రకు బ్జడెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని సినీ నటుడు, దర్శకుడు ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. మంగళవారం స్థానిక కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక దినోత్సవం, జానపద ఆటా, పాటా కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర ¬దా కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఆచరణలో విఫలమైందన్నారు. ప్రత్యేక నిధుల కోసం తెలంగాణ, ఆంధప్రదేశ్‌ సీఎంలు కృషి చేయాలని కోరారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రముఖ జానపద గాయకులు యశ్‌పాల్‌ మాట్లాడుతూ విద్యారంగంలో జనపదగేయాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ ఎ.శంకర్‌, వైస్‌ప్రిన్సిపల్‌ జానకిరామయ్య, కళాశాల ఇన్‌ఛార్జి రఘురామయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు