బ్యాంకు తరలింపు వద్దని మహిళల నిరసన
మద్దూర్: మద్దూర్ మండలం దూల్ మిట్టలోని ఎన్‌బీఐ బ్యాంకును తరలించ వద్దని 500 మంది మహిళలు గురువారం బ్యాంకు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత 35ఏళ్లగా ఏడు గ్రామాలకు సేవలందిస్తున్న బ్యాంకును నష్టాల పేరిట దూల్ మిట్ట నుంచి తరలించేందుకు అధికారులు, ప్రభుత్వం చేసున్న ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. అనంతరం బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు.