బ్రతుకు దశ మారటానికి చదువు ముఖ్యం

జీ.ఎస్.ఆర్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం సహకారంతో, మంచిర్యాల జిల్లా కొటపల్లి మండలం లోని అన్నారం, లక్ష్మీపురం గవర్నమెంట్ స్కూల్లో స్ 150 మంది విద్యార్థులకు సుమారు ముప్పయివేల రూపాయల విలువ గలా పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, పెన్స్, పెన్సిల్స్, జామెట్రీ బాక్స్, ప్యాడ్స్ ఇవ్వడం జరిగినదని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ బాబు తెలిపారు. ఆర్కేపీ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు గా పనికేగేస్తున్న డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ మనిషి బ్రతకటానికి ఆహారం ఎంత అవసరమో, మన బ్రతుకులదిశ, దశ మారటానికి చదువు ఒక్కటే మార్గం అని చెప్పారు. ఇలాంటి మారుమూల గ్రామాలకు వచ్చి పిల్లలకు చదువుకోవాటానికి ఫౌండేషన్ ద్వారా పుస్తకాలు అందించడం చాలా సంతోషంగా ఉందని, మునుముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపసుతామని తెలిపారు. అనంతరం ఫౌండేషన్
గౌరవ అధ్యక్షులు కృష్ణమూర్తి గురు స్వామీ మాట్లాడుతూ జీ.ఎస్.ఆర్. ఫౌండేషన్ ఎలాంటి స్వార్థం లేకుండా, నిక్కచ్చిగా, స్వచ్ఛందంగా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఆకనపల్లీ సురేష్, బద్రిసతిష్ ,కన్న రమేష్, వెంకన్న, ప్రకాష్, సతీష్, మూర్తి, రహీమ్, అశోక్, రామ్ కిషోర్, పిట్ట శ్రీకాంత్, వేణు, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు