బ్రహ్మానందరెడ్డి పాలనను తలపిస్తుంది: శంకర్రావు

హైదరాబాద్‌, (జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పాలన.. కాసు బ్రహ్మానందరెడ్డి పాలనను తలపిస్తోందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. పోలీసుల నిర్బంధంలో ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలొస్తే తనకు ఫోన్‌ చేయండి అని పేర్కొన్నారు. కోర్టులో సీఎంను మొదటి ముద్దాయి, హోంమంత్రి రెండో ముద్దాయిగా, డీజీపీని మూడో ముద్దాయిగా నిలబెడుతానని చెప్పారు. చలో అసెంబ్లీ ఘటనలకు వారే కారణమని శంకర్రావు తెలిపారు.