బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యేల శంకుస్థాపన
సంగారెడ్డి,మే5(జనం సాక్షి): పఠాన్ చెరువు, కంది మండలాల శివారు బేగంపేట గ్రామంలో రూ.2 కోట్ల 40 లక్షలతో కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో అన్ని గ్రామాలకు రవాణ సౌకర్యం మెరుగుపడిందని ఎమ్మెల్యేలు చెప్పారు. కొత్తగా గ్రామాల్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం చేశామని వారు వివరించారు.