భక్తిశ్రద్ధలతోనే భగవంతున్ని ప్రార్థించాలి.
వినాయక మంట పాల దగ్గర భక్తి పాటలు ఆలపించాలి.
హిందూ ఉత్సవ కేంద్ర సమితి, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నరసింహులు.
తాండూరు ఆగస్టు 31 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం లోని పలు వినాయక మండపాలను హిందువుస్సా కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శి పట్ల నర్సింలు సందర్శించారు.
బుధవారం వినాయక చవితి పురస్కరించుకొని పట్టణంలో వివిధ వార్డులలో అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక ప్రతిమలను ప్రతిష్టాపించార
ఈ సందర్భంగా హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శి పట్టుల నర్సింహులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక మంటపల దగ్గర భక్తి పాటలను ఆలపిస్తూ భక్తిశ్రద్ధలతో భగవంతుని కొలవాలని సూచించారు హిందూ సంప్రదాయం ప్రకారం
భక్తి పాటలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మండపాల దగ్గర అసాంఘిక కార్యక్రమాలకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. నిమజ్జనం రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి గణేష్ లను
ఊరేగింపుగా తీసుకెళ్లాలని, సూచనలు చేస్తూ, గణేష్ నిమజ్జనం కోకట్ గ్రామ సమీపంలో ని కాగ్నా నదిలో నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.ఈకార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ పూజారి పాండు, మనపూరం రాము, వెంకన్న గౌడ్, బోయ రాజు, అశోక్ ముదిరాజ్, సాయి కుమార్,బోయ నరహారి,సురేష్,తదితరులు ఉన్నారు.