భక్తిశ్రద్ధలతో వనపర్తిలో ఘనంగా బోనాల పండుగ

వనపర్తి: ఆగస్టు 23( జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు భక్తుశ్రద్ధలతో బొట్లు పెట్టి వేపాకుతో అందంగా అలంకరించిన బోనపుకుండలను మహిళలు యువతులు నెత్తినెత్తుకొని ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ దేవతకు బోనాలను సమర్పించడం ఈ పండుగ విశేషం పట్టణంలోని గాంధీనగర్ ఆడపడుచులు మహిళలు అందంగా ముస్తాబై ప్రజలతో కలిసి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా పోచమ్మ గుడికి వెళ్లి నైవేద్యం సమర్పించారు కొందరు కోళ్లను పొట్టేళ్లను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు వనపర్తి లోనే గాక జిల్లా కేంద్రంలోనే గాక పలు గ్రామాలలో ఈ మంగళవారం పోచమ్మ గుడి లకు బోనాలతో వెళ్లి బోనం కుండలోని అన్నాన్ని నైవేద్యంగా దేవతకు సమర్పించుకున్నారు కొందరు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు పోచమ్మ దేవతకు నైవేద్యం పెట్టి పూజిస్తే తమ కుటుంబాన్ని పిల్లాపాపల ను రోగాలు రాకుండా కాపాడి చల్లగా చూస్తోందన్నది ప్రజల విశ్వాసం పురుషులు యువకులు కూడా ఆనందోత్సవాల మధ్య ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.