భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు
ఖానాపురం సెప్టెంబర్ 2జనం సాక్షి
మండల వ్యాప్తంగా గణపతి పూజలు మూడో రోజుకు చేరాయి గ్రామాల్లో వాడవాడలా ఏర్పాటు చేసిన గణపతి మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలోని శ్రీరామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుండ్ల వాడ లో ప్రతిష్టించిన గణపతి మండపం వద్ద సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు.
ఇట్టి పూజ లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.