భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ.

అలరించిన కళాకారుల ప్రదర్శనలు, పోతురాజుల విన్యాసాలు.
ఆకట్టుకున్న జబర్దస్త్ కొమరక్క కామెడీ.
డప్పు వాయిద్యాలతో బోనాలు ఊరేగింపు.
ఆలయ అభివృద్ధికి ముందుకు రావాలి. ఆలయ అభివృద్ధి నిర్వాహకులు బాలరాజు,పాండు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు23 (జనంసాక్షి):
జిల్లా కేంద్రంలో మంగళవారం నాడు ఈదమ్మ పోచమ్మ ఎల్లమ్మ బోనాల పండుగను ఉత్సవ నిర్వాహకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాదిమంది ప్రజలు గ్రామ దేవతలకు మొక్కులను సమర్పించారు. సాయంత్రం డప్పు వాయిద్యాలతో పోతురాజుల విన్యాసంతో నిర్వహించిన కళా ప్రదర్శనలు వేలాది మందిని ఆకట్టుకున్నాయి.చిన్నారులు మహిళలు పెద్ద ఎత్తున బోనంకుండలను నెత్తిన పెట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కళాకారులు నృత్యాలను ప్రదర్శించారు.అనంతరం ఈదమ్మ దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్న పలువురిని సన్మానించారు.ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి నిర్వాహక కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పట్టణంలో నుంచి ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.