భక్తుల సేవలో మా వంతు పాత్ర…
భక్తులకు నిరంతరంగా మినరల్ వాటర్ పంపిణీ..
రాధ టిఎంటి స్టీల్ ఎమ్డి అక్షత్ షరాఫ్..
ములుగు(మేడారం),ఫిబ్రవరి11(జనం సాక్షి):-
మేడారం భక్తుల సౌకర్యార్థం గత మూడు మహా జాతరల తో పాటు మినీ జాతర ల సందర్భంగా రాధ టిఎంటి స్టీల్ కంపెనీ ద్వారా తమ వంతు సేవలు అందిస్తున్నామని ఆ కంపెనీ ఎండి అక్షత్ షరాఫ్ అన్నారు.శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం,ఆర్టీసీ బస్టాండ్, ఇంచర్ల సమీపంలోని ఎర్రి గట్టమ్మ దేవాలయం వద్ద ఉచిత మినరల్ వాటర్,మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై కంపెనీ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియా ఖండంలోని అధిక సంఖ్యలో హాజరయ్యే శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల సౌకర్యార్థం ఉడతాభక్తిగా తమ కంపెనీ ద్వారా తమ వంతు సహాయం చేయాలని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం నుండి ఈ నెల 20వ తేదీ వరకు ఈ కేంద్రాలను కొనసాగించి భక్తులకు ఉచితంగా మినరల్ వాటర్ ను అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జాతర జరిగే నాలుగు రోజులలో ప్రత్యేకంగా మజ్జిగ ప్యాకెట్ల ను సైతం భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు జాతర జరిగే మేడారం తో పాటు, జాతర కు చేరుకునే వివిధ మార్గాలలో ని ముఖ్య ప్రదేశాలలో కరోనా నిబంధనలను తెలిపే అవగాహన బోర్డ్లను సైతం తమ కంపెనీ ద్వారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వ్యాపారం కలిగిన తమ సంస్థ ద్వారా సమాజ సేవ చేసేందుకు ఎప్పుడూ ముందు ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కంపెనీ జిఎం విరేష్ కుమార్, ఏజీఎం నరేష్,వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ ఆంజనేయ,కంపెనీ డీలర్ లయన్ గంగిశెట్టి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ ఎస్.రవీందర్ రెడ్డి,ఉపాధ్యక్షుడు లయన్ చుంచు రమేష్,లయన్ కోశాధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.