భగత్ సింగ్ జయంతిని ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలి:

ఏఐఎస్ఎఫ్ జిల్లా జాయింట్ సెక్రెటరీ చట్ల సమ్మయ్య

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్ 23:
సెప్టెంబర్ 28న భగత్ సింగ్ 115వ జయంతిని అధికారికంగా నిర్వహించాలని మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం తహశీల్దార్ ముబిన్ అహ్మద్ కు ఏఐయస్ఎఫ్ నాయకులు వినితి పత్రం అందజేశారు. భగత్ సింగ్ చరిత్ర
యావత్తు సమాజానికి తెలిసే విధంగా పాఠ్యాంశంలో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా లిఖించడంతో పాటు భగత్ సింగ్ జయంతి(సెప్టెంబర్ 28), వర్దంతి(మార్చి 23)లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని అలాగే భారతరత్న ప్రకటించాలని జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని
తెలంగాణ ప్రభుత్వం భగత్ సింగ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని,
భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ఆక్ట్ (BNEGA) ఏర్పాటు చేయాలిని మండల తహసిల్దార్ కు
వినతి పత్రం ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు.
ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొంకట ప్రశాంత్, మండల నాయకులు అభిలాష్, శ్రీనివాస్, మధు, రేవంత్ పాల్గొన్నారు.