భగలాముఖీ శక్తిపీఠం తో భారతవానికే ప్రత్యేక గుర్తింపు

శివ్వంపేట వేదక్షేత్రంగా పరిడా విల్లానున్నది
*నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
శివ్వంపేట జూన్ 25 జనం సాక్షి :
యావత్ భారతదేశంలోనే బలమైన శక్తిపీఠంగా మండల కేంద్రమైన శివ్వంపేట లో నిర్మిస్తున్న శ్రీ భగలాముఖీ శక్తిపీఠం పరిడవిల్లనున్నదని  నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్ రెడ్డి అన్నారు. బగలాముఖీ శక్తిపీఠం నిర్మాణ ప్రాంగణంలో అమ్మవారి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో  జరిగిన శిలన్యాసం కార్యక్రమంలో సునీత రెడ్డి శేరి సుభాష్ రెడ్డి లతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ భగలాముఖీ శక్తిపీఠం చాలా గొప్పదని, అమ్మవారి దయతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఉత్తమమైన  సేవలను అందిస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భగలాముఖీ అమ్మవారి దయతో శివ్వంపేట మండల కేంద్రం ఒక పుణ్యక్షేత్రంగా మరనున్నదని,ఇది మెదక్ జిల్లా ప్రజల అదృష్టమని ఆమె అన్నారు. బగలా ముఖీ శక్తిపీఠం నిర్మాణానికి తనవంతు సహకారం తప్పకుండా అందిస్తామని ఆమె అన్నారు.  ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి సేవకునిగా ఇక్కడ నిర్మించతలపెట్టిన శక్తిపీఠం ప్రాంగణంలో ఇక్కడికి వచ్చే భక్తులకు అనుకూలంగా ఉండేవిధంగా ధ్యాన మందిరం నిర్మాణం పూర్తిచేసి అమ్మవారి కృపకు పాత్రుడనై సేవచేస్తానని ఆయన అన్నారు. జిల్లా సీనియర్ నాయకులు, శివ్వంపేట మాజీ సర్పంచ్ పబ్బ రమేష్ గుప్త మాట్లాడుతూ గతంలోనే శివ్వంపేట పట్టణం ఆధ్యాత్మికతకు మారుపేరుగా ఉండేదని, శాస్త్రుల కృష్ణాశాస్త్రి  ఆధ్వర్యంలో ఆధ్యాత్మికతకు అంకురార్పణ జరిగిందని, శాస్త్రుల విశ్వనాథ శర్మ దానికి మరింత బలం చేకూర్చడం జరిగిందని ఆయన అన్నారు. ఇప్పుడు వెంకటేశ్వర శర్మ దానిని కొనసాగిస్తున్నాడని ఆయన ప్రశంసించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారందరికీ జెడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా కండువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది శివకుమార్ గౌడ్,  గ్రామ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, సికింద్లాపూర్ సర్పంచ్ ఏనుగు సుధాకర్ రెడ్డి, పెద్దగొట్టిముక్కల సర్పంచ్ చంద్రకళ శ్రీశైలం, ఉపసర్పంచ్ పద్మ వెంకటేశ్, వంజరి కొండల్, గౌరీశంకర్,  ముద్దగల్ల లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.