భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం ఓ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 14(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారిని శుక్రవారం సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ తో పాటు హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావిణ్య, వరంగల్ నగర్ మేయర్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. వీరికి అర్చకులు భద్రకాళి శేషు, ఆలయం ఈవో శేషు భారతి పూర్ణకుంభం చే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రకాళి ఆ లయ మాడవీధుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 30 కోట్లు మంజూరు చేయడంతో పాటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి రూపాయలు మూడు కోట్లు కూడా వెచ్చించేందుకు నిర్ణయించడంతో భద్రకాళి ఆలయం ప్రాంతం పర్యాటకులకు మరింత ఆకర్షిస్తుందని అధికారులు తెలిపారు.