భద్రాచలంలో సీతారాముల కల్యాణం
భద్రాచలం,(జనంసాక్షి): ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారాముల నిత్య కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. రామయ్య సన్నిధిలోని బేడా మండపంలో శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించిన 65 నిత్యకల్యాణాలలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. సీతమ్మ వారిని తమ కూతురుగా భావించి దంపతులు కన్యాదానం చేయడమనేది ఎంతో పుణ్యమని అర్చక స్వాములు వివరించారు.