భరోసా కేంద్రాలతో తక్షణ సహాయం….

స్వాతి లక్రా ఐపీఎస్…
మహిళల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధచట్టాలపై అవగాహన కలిగి ఉండాలి…
-జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య..
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ప్రారంభంలో పాల్గొన్న …
-గద్వాల ఎమ్మెల్యే బి.కృష్ణమోహన్ రెడ్డి.. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం…
గద్వాల రూరల్ జూన్ 23 (జనంసాక్షి):-  భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుందని అదనపు డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీసు, ఉమెన్ సెప్టీ విభాగం శ్రీమతి స్వాతి లక్రా అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలో జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష,గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం లతో కలిసి భరోసా కేంద్రం, స్త్రీ బాలల సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళల జోలికొస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేదని లేదని, కఠిన చర్యలు తప్పవని ఐపీఎస్ స్వాతి లక్రా హెచ్చరించారు. మహిళల రక్షణకు సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని,‘ షీ టీమ్స్‌’, ‘సఖీ’ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయన్నారు. భరోసా కేంద్రాలు బాధిత మహిళలకు సత్వర న్యాయం, వైద్యం, పరిహారం అందించేందుకు కృషి చేస్తాయని వివరించారు..జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్మన్ సరితమ్మ మాట్లాడుతూ…దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళ రక్షణ కోసం సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా మహిళల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వేధింపులు ఎదుర్కొంటున్న బాధిత మహిళలకు అండగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోక్సో, లైంగిక దాడి కేసుల్లో బాధితులకు ఇక్కడ సేవలతోపాటు అన్ని రకాల కేసుల్లో సత్వర న్యాయం అందించేందుకు భరోసా కేంద్రం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఖీ, షీ టీమ్స్‌ ఏర్పాటు చేసి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించిందన్నారు. మానసిక, శారీరక వేధింపులకు గురయ్యే వారికి భరోసా కేంద్రం తక్షణ సహాయం అందిస్తుందన్నారు..గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ…బాధిత మహిళలకు కౌన్సిలింగ్‌ ఇచ్చి మనోధైర్యం నింపడం, ప్రభుత్వం నుంచి అందే పరిహారం కోసం కృషి చేయడం, న్యాయ, వైద్య సహాయం ఈ కేంద్రం ద్వారా అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీహర్ష, ఎస్పీ  రంజన్ రతన్ కుమారు,డిఎస్పీ రంగస్వామి,జెడ్పి వైస్ చైర్మన్ సరోజమ్మ రమేష్ నాయుడు, గట్టు ఎంపిపి విజయ్,వార్డ్ కౌన్సిలర్ నాగలత,సిఐ,ఆయా మండలాల ఎస్ఐ లు,పోలీసులు పాల్గొన్నారు.