భర్త రాజకీయ వారసత్వం కోసం యత్నం
సుజాతక్కను ప్రజలు ఆదరిస్తారా లేదా అన్న చర్చ
సిద్దిపేట,నవంబర్2(జనంసాక్షి): రామలింగారెడ్డి రాజకీయాల్లో ఉండగా ఏనాడూ రాజకీయ వ్యవహారాలప ఆసక్తి చూపని ఆయన భార్య ఇప్పుడు దుబ్బాకలో టిఆర్‌ఎస్ అధ్యర్థిగా తన అదృష్టాన్ని పరిక్షించు కోబుతన్నారు. ఉద్యమం నుంచి వచ్చిన రామలింగారెడ్డి నిఖార్సయిన నేతగా ఎదిగి ప్రజల మన్ననలు పొందారు. రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఇప్పుడామె భర్త రాజకీయ వారసత్వాన్ని అందుకునే క్రమంలో పోరాటంలోకి దిగారు. కెసిఆర్, తెలంగాణ సెంటిమెంట్‌కు తోడు భర్తపోయిన పుటటెడు దుఃఖంలో సుజాతక్క ముందుకొచ్చింది.. ప్రజలు అశీర్వదించి కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాని ప్రజలను అర్థించారు. గడపగడపకూ ఆమె ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించగా, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీఆర్‌ఎస్‌ది రైతు ప్రభుత్వమని, రైతును రాజును చేయాడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం కరెంట్ కష్టాలతో అల్లాడిందని, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బోర్ల వద్ద విూటర్లు బిగించి బిల్లులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నదని నేతలతో పాటు తనూ చెప్పి ఓట్లు అర్థించింది. ఉప ఎన్నికలో ఆ రెండు పార్టీలకు డిపాజిట్ దక్కకుండా ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రచారంలో పాల్గొన్న నేతలంతా అన్నారు. రైతులకు ఉచితంగా 24గంటల విద్యుత్ ఇస్తున్న టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా 24గంటల కరెంట్ ఇవ్వడం లేదని, అలాంటి పార్టీకి ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు. లింగన్న ఆశయాలను కొనసాగించేందుకు విూ ముందుకు వచ్చిన సుజాతమ్మను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. తనను కెసిఆర్ ఎంపిక చేశారని, ఆయన అడుగు జాడల్లో నడుస్తానని ప్రకటించారు. మొత్తంగా ఇంటిపట్టున ఉన్న సుజాత భర్త రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చకుంటారా, అందుకు ప్రజలు ఔనంటారా అన్నది నేటి పోలింగ్ ద్వారా ప్రజలు తేల్చనున్నారు.