భవనంపైకి ఎక్కిన తెరాస ఎమ్మెల్యేలు అరెస్టు
హైదరాబాద్ : శాసనసభ ప్రాంగణంలోని తెరాస శాసనసభాపక్ష కార్యాలయ భవనంపైకి ఎక్కి నల్లజెండాలు ఎగురవేసిన తెరాస ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, వినయ్‌భాస్కర్‌లను మార్షల్స్ అతి కష్టం మీద కిందకు దించారు. కిందకు వచ్చిన వెంటనే ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.