భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి

వెంకట్రాంపురంలో  తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రెండవ మహాసభల పోస్టులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సహాయ కార్యదర్శి ఆర్ వీరయ్య పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల జీవన పరిస్థితులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు తదితర అంశాలను చర్చించి భవిష్యత్తు పోరాట కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసం జరుగుతున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి  నిరుపేదల నుండి మొదలుకొని సంపన్న వర్గాల వరకు భవనాలను నిర్మిస్తూ భవన ఇతర నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవటంలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. నవంబర్ నెల సూర్యాపేట జిల్లా కేంద్రంలో 26వ తారీఖున జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాలి నాగరాజు, వెంకటేష్ , వీరబాబు, రాజు, ఎల్లయ్య,  సత్యనారాయణ, అశోక్ రామకృష్ణ, అంజయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.