భాజపాలో యువతకే అధిక ప్రాధాన్యత

హత్నూర: భాజపాలో యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి, తాలూక ఇంఛార్జి కార్యదర్శి సింగయ్యపల్లి గోపీ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం భాజపా అనుబంధ సంఘాల కార్యకర్తలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాజపాలో యువతకు పెద్దపీట వేస్తున్నామని… ఆ దిశగా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగ ప్రభువు, ఉదయ్‌ , రాజు, రవి, నవీన్‌, లక్ష్మణ్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.