భాజపాలో లుకలుకలు
కోర్ కమిటీ సమావేశానికి అద్వానీ డుమ్మా
జఠ్మలానీ లేఖతో కలకలం
గడ్కరీకీ బాసటగా నిలిచిన కార్యవర్గం
న్యూఢిల్లీ, నవంబర్ 6 (జనంసాక్షి): భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ భవితవ్యం డోలాయమనంలో పడింది. డిసెంబర్ 19తేదీతో ఆయన పదవీ కాలం ముగియనున్నది. ఇటీవల జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశాలలో పార్టీ రాజ్యాంగాన్ని సవరించి రెండో దఫా కూడా గడ్కరీని అధ్యక్షుడిగా కొనసాగించాలని నిర్ణయించా రు. కాగా మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో గడ్కరికి బాసటగా నిలిచారు. అయితే ఇటీవల ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో గడ్కరీ పదవినుంచి వైదొలగాల్సిందేనని పార్టీ సీనియర్ నేతల నుంచి ఒత్తిడి
ప్రకటన చేసి మూడు సంవత్సరాలు గడిచిపోయిందని, ఎవరు ఏమిటనే విషయం అర్థమై కూడా అర్థం కానట్టూ నటించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమకార్యాచరణపై బుధ, గురువారాల్లో కరీంనగర్‌లోజరిగే మేథోమథన కార్యక్రమంలో చర్చిస్తామని, 8న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఉద్యమ కార్యాచరణపై విస్పష్టమైన ప్రకటన చేస్తారని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా ఏరియల్ వ్యూ నిర్వహించడం కాదని, రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. చంద్రబాబు, విజయమ్మ, ముఖ్యమంత్రి ఎవరైనా పంట నష్టపోయిన రైతులను ఓదార్చేందుకు గోదావరి, కృష్ణా జిల్లాలకే వెళుతున్నారు కాని, తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడడంలేదని ఆరోపించారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆదర్శ రైతులచే సర్వే చేయించాలని ప్రభుత్వం ఆలోచించడం సరికాదన్నారు. వ్యవసాయం అంటే తెలియని కాంగ్రెస్ కార్యకర్తలను ఆదర్శ రైతులుగా ఎంపిక చేశారని ఆయన ధ్వజమెత్తారు. పత్తి రైతులు భారీగా నష్టపోయారని, ఎకరానికి రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకం లూపభూయిష్టంగా ఉందని కేటీఆర్ ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు కచ్చితమైన సర్వేలు నిర్వహించి, వాస్తవ నివేదికలు ప్రభుత్వానికి పంపేలా ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ఈ వరదల వల్లముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారికి కనీసం నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. 2011లో 40 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 31 మందికే నష్టపరిహారం చెల్లించారని ఆయన ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వ విధానాలకు లోబడి , విధి విధానాలను అనుసరించి ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రభుత్వమే చెప్పడం దారుణమన్నారు. రైతుల విషయంలో రాజకీయాలు, ప్రాంతాలు వివక్ష వీడి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.