భాజపా, కాంగ్రెస్‌ దొందూదొందే

– కాంగ్రెస్‌తో టీడీపీ కలుస్తుందని అసత్యప్రచారం తగదు
– పదవులు రాలేదని మోత్కుపల్లి నీచంగా మాట్లాడుతున్నాడు
– ఏపీ ప్రజలకు కేంద్రం నమ్మకద్రోహం చేసింది
– మహానాడులో మంత్రి అచ్చెన్నాయుడు
విజయవాడ,మే29(జ‌నం సాక్షి): భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు దెందూదెందేనని, చంద్రబాబు కాంగ్రెస్‌ అద్దె మైక్‌ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనడం దారుణమని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మూడోవ రోజు మహానాడులో ఆయన మాట్లాడుతూ టీడీపీ కాంగ్రెస్‌తో కలుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండూ రాష్ట్రానికి అన్యాయం చేశాయని ఆయన ఆరోపించారు. పదవులు రాలేదని మోత్కుపల్లి నర్సింహులు నీచంగా మాట్లాడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. కొంతమంది ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, జిల్లాలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. తమకు ఇష్టంలేకపోయినా రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి బీజేపీతో కలిసి పోటీ చేశామని, సీట్లు తగ్గుతాయని తెలిసీ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పోటీ చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలని అచ్చెన్నాయుడు అన్నారు. నాలుగేళ్లు ఎందుకు ఊరుకుంటున్నారని చాలా మంది విమర్శలు చేస్తున్నారని, మొదటి ఏడాదే కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తే ¬దా వచ్చేదని అంటున్నారని, అలా చేస్తే ఈ మాత్రమైనా అభివృద్ధి జరిగేది కాదని మంత్రి
పేర్కొన్నారు. రాజధాని, పోలవరం నిర్మాణం… ఇవన్నీ సాధించడానికి ఓపిక పట్టి ఇంతవరకు మోదీతో కలిసి పనిచేశామని అచ్చెన్నాయుడు వివరించారు. నాలుగేళ్ల తర్వాత మోదీ నమ్మక ద్రోహం చేశారని మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.