భాజపా తాత్కాలిక అధ్యక్షుడిగా అద్వానీ?
ఢిల్లీ: భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కరీ రాజీనామాకై అన్నివైపులనుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ కోర్ గ్రూప్ ఈ రోజు సాయంత్రం సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో గడ్కరీ రాజీనామాపై చర్చిస్తారని భావిస్తుండగా మరోవైపు పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా అద్వానీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచీ గడ్కరీ పార్టీలో కీలక నేతలైన సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలతో వారి వారి నివాసాల్లో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సుష్మాస్వరాజ్ గడ్కరీకి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ట్వీచ్ చేయడం గమనార్హం.