భాజపా మైనార్టీ మోర్చా కార్యదర్శిగా సైఫూల్లా ఖాన్
బిచ్కుంద అక్టోబర్ 18 (జనంసాక్షి) భాజాపా మైనార్టీ మోర్చ రాష్ట్ర కార్యదర్శిగా బిచ్కుంద మండలానికి చెందిన సైఫుల్లా ఖాన్ ను నియమించారు. దీంతో పాటు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ వ్యవహారాలు, వక్ఫ్ మరియు హజ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయనకు బిచ్కుంద వాసులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు పార్టీ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.