భానుడి భగభగలు
బస్సుస్టాపు లేని ప్రధాన కూడలిలు
ఉండవెల్లి ఏప్రిల్24(జనంసాక్షి)
రోజురోజుకీ మండుతున్న ఎండలతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారుతున్నాయి. భరించలేని వేడి, ఉక్కపోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఉదయం 10గంటలు తర్వాత బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి తోడు కొన్ని ప్రాంతాల్లో వడగాలులు సైతం వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఏడాదిలో తెలుగు రాష్ట్రాలలో గద్వాల మహబూబ్ నగర్ జిల్లాలో చొప్పున41కి పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అలంపూర్ చౌరస్తా ప్రాంతంలో నిలవడానికి నీడలేక పోవడంతో ప్లేఓవర్ బ్రిడ్జి క్రింద సేద తీరుతున్నారు.ఇటు పాలకులు గాని అదికారులుగాని ఏమి పట్టనట్టుగా వ్యవహారిస్తూనారు.ప్రజలు పడే ఇక్కట్లు కనపడటంలేదు. రాయచూర్ హైదరాబాద్ పట్టణాలకు వెల్లే కూడలి కావడం ముఖ్యంగా తెలంగాణ బార్డర్ కావడం అక్కడ నిలవడానికి బస్ స్టాపు లేక పోవడం మన పాలకులు నిర్వాహకం అర్థం అవుతుంది.