భారతదేశం భాగ్య సీమ

3

– 20 వేల టన్నుల బంగారు నిల్వలున్నయ్‌

– మనది పేద దేశం ఎట్లయితది

– గోల్గ్‌ స్కీం ప్రారంభసభలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,నవంబర్‌ 5 (జనంసాక్షి):

నిరుపయోగంగా ఉన్న బంగారం నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మూడు బంగారం స్కీంలను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… దేశంలో సుమారు 20వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని తెలిపారు. దేశంలో బంగారం నిల్వలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. బంగారం నిల్వలను వెలికితీసి…డిమాండ్‌ తగ్గించే చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నిరుపయోగంగా ఉన్న బంగారం నిల్వలను ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. దేశంలో 20వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని… ఇన్ని బంగారం నిల్వలున్న భారతదేశం పేద దేశం ఎలా అవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బంగారం డిమాండ్‌ తగ్గింపు, నిరుపయోగ బంగారం వెలికితీసేందుకు మూడు బంగారం డిపాజిట్ల పధకాలను ప్రాంభిస్తున్నట్లు  నరేంద్రమోదీ ప్రకటించారు. బంగారం నిల్వలను వెలికితీసి… డిమాండ్‌ తగ్గించే చర్యలు చేపట్టాలన్నారు. నిరుపయోగంగా ఉన్న పసిడినిల్వలను ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. భారత్‌లో మహిళల పేరిట ఎలాంటి ఆస్తులు ఉండటం లేదని… కుటుంబ సభ్యుల పేరిటే ఆస్తులుంటున్నాయన్నారు. మహిళలకు సాధికారత కల్పించే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇంట్లో బంగారం ఉంచాలంటే ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందని… బంగారానికి భద్రత లేకుండా పోయిందన్నారు. బంగారం డిపాజిట్ల పథకంలో బాండ్ల రూపంలో భద్రంగా ఉంటుందన్నారు. బంగారం బాండ్లు ఎవరైనా దొంగిలించినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. దీనికితోడు ఇదో ఆదాయమార్గం కాగలదన్నారు. ఇందులోభాగంగా ఏడాది వ్యవధి గల బంగారం డిపాజిట్లపై 2.75శాతం వడ్డీ ఇస్తారు.3, 5-7 ఏళ్ల వ్యవధి గల బంగారం డిపాజిట్లపై 2.25శాతం వడ్డీ ఇస్తారు. 2-15 సంవత్సరాల వ్యవధి గల బంగారం డిపాజిట్లపై 2.5 శాతం వడ్డీ ఇస్తారు. బంగారం డిపాజిట్‌ పథకంలో ఐదేళ్ల తరువాత వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. కార్యక్రమానికి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లి, నిర్మలా సీతారామన్‌, పలువురు నాయకులు హాజరయ్యారు.

మూలుగుతున్న బంగారానికి వెలుగు

మన దేశంలోని చాలా మంది ఇళ్లలో బంగారం నిరుపయోగంగా పడి ఉంది. ఆభరణాల రూపంలో లాకర్లలో మూలుగోంది. దీనికితోడు విదేవౄల నుంచి రోజూ కొనుగోళ్లు చేస్తునే ఉన్నారు. దీంతో విదేశీమారకం కూడా భారమవుతోంది. కొనుగోలు చేసిన బంగారాన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ధరిస్తారు. మిగిలిన సమయాల్లో వృధాగా పడి ఉంటుంది. అటువంటి ఆదాయ మార్గంగా మలచుకునే గోల్డ్‌ మానెటైజేషన్‌ స్కీమును కేంద్ర ప్రభుత్వం 2015-16 వార్షిక బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. దీనిని ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తున్నారు. పసిడి నగదీకరణ పథకం ప్రకారం బంగారు నాణేలు, కడ్డీలు, ముత్యాలు, రాళ్లు లేని బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయవచ్చు. కనీసం 30 గ్రాములు ఉంటేను గోల్డ్‌ డిపాజిట్లను అంగీకరిస్తారు. గరిష్ఠంగా ఎంతైనా డిపాజిట్‌ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం తరుపున బ్యాంకులు ఈ బంగారాన్ని తీసుకుంటాయి. ఇలాంటి బంగారం స్వచ్ఛత, నాణ్యతను పరీక్షించి ధృవీకరించిన తర్వాత ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థలు విక్రయిస్తాయి. ఆ నిధులు ఖజానాకు చేరతాయి. గోల్డ్‌ డిపాజిట్‌ ఖాతాలను బ్యాంకుల తరుపున రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తుంది. డిపాజిట్‌దార్ల ఖాతాలో వడ్డీ జమ అవుతుంది.ఇక సావరెన్‌ గోల్డ్‌బాండ్‌ స్క్మీములో కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్బీఐ బాండ్లు జారీ చేస్తుంది. ఈపథకం కోసం ఈనెల 5 నుంచి 20 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 26న బాండ్లు జారీ చేస్తారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఒక వ్యక్తి కనీసం 2 గ్రాములు బంగారంతో ఆరంభించి 500 గ్రాముల వరకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై 2.75 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోసియేషన్‌ గత నెల 26-30 తేదీ మధ్య బంగారు ముగింపు ధర సగటు ఆధారంగా గోల్డ్‌ బాండ్లకు గ్రాములకు 2,684 రూపాయలుగా నిర్ధారించారు. బ్యాంకులతోపాటు ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో వీటిని విక్రయిస్తారు. మన దేశంలో నివసించే వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, ధాతృత్వ సంస్థలు గోల్డ్‌ బాండ్లను కొగుగోలు చేయొచ్చు. పసిడి బాండ్ల కాలపరిమితి ఎనిదేళ్లుగా నిర్ణయించారు. ఈ బాండ్లను లోన్లకు కొల్లేటరల్‌ సెక్యూరిటీగా ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీపై ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది.

అశోచక్రం ముంద్రతో ఉన్న……. గోల్డ్‌ కాయిన్స్‌

పసిడి నగదీకరణ పథకంలో మరొకటి గోల్డ్‌ కాయిన్‌ స్మీము. మన దేశంలో మొదటిసారిగా ఈపథకాన్ని ప్రవేశపెడుతున్నారు. అశోకచక్రం ముద్రతో ఉన్న బంగారు నాణేలను విక్రయిస్తారు. ఇప్పటిరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నాణేలను విక్రయిస్తూ వచ్చారు. ప్రారంభంలో 5, 10 గ్రాములు బంగారు నాణేలు, 20 బంగారు కడ్డీలను విక్రయిస్తారు. మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పరేషన్‌ ఆఫ్‌ ఇండియా సేల్స్‌ కౌంటర్లలో ఈ నాణేలను అమ్ముతారు. మొదటల్లో 5 గ్రాముల బరువున్న 15 వేల బంగారు నాణేలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 10 గ్రాముల బంగారు నాణేలు 20 వేలు విక్రయిస్తారు. 3,750 బంగార కడ్డీలు అందుబాటులో ఉంచుతారు. గురువారం నుంచి గోల్డ్‌ మానెటైజేషన్‌ స్కీము అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం అమల్లో ఉన్న 1999 గోల్డ్‌ డిపాజిట్‌ పథకం రద్దు అవుతుంది.