భారతీ ఎయిర్‌టెల్ నికరలాభంలో తగ్గుదల
ముంబయి : టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ నికరలాభం 29.7 శాతం తగ్గింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో గత ఏడాది 1.027 కోట్ల నికరలాభం చూపిన సంస్థ ఈ ఏడాది 29.7 శాతం తగ్గుదలతోరూ. 721.2 కోట్లు చూపింది. అయితే సంస్థ మొత్తం ఆదాయం మాత్రం ఈ త్రైమాసికంలో 17.14 శాతం పెరిగి రూ.20,283 కోట్లు నమోదు చేసింది.