భారత్‌లో ప్రకంపనలు

24

 

 

-58 మంది మృతి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి):

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంప తీవ్రత ఉత్తర భారతంతో పాటు ఈశాన్య రాష్గాలపై ప్రభావాన్ని చూపించింది. దేశంలో భూకంపం వల్ల ఇప్పటి వరకూ 58 మంది మృతి చెందినట్లు కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయల్‌ వెల్లడించారు. బిహార్‌లో 47, ఉత్తరప్రదేశ్‌లో 8, బంగాల్‌లో ముగ్గురు మృతి చెందినట్లు చెప్పారు. నేపాల్‌లో సహాయక చర్యలకు 5 బృందాలను పంపినట్లు తెలిపారు. భూకంప ప్రభావిత రాష్గాలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు చెప్పారు. భూకంప సహాయక చర్యల కోసం కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నేపాల్‌లో  సంభవించిన భూకంపం భారత్‌లోనూ విధ్వంసం సృష్టించింది. భూకంపం తీవ్రతకు ఇప్పటి వరకు భారత్‌లో 58 మంది మృతి చెందారు. బీహార్‌లో పందొమ్మిది మంది, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడుగురు, పశ్చిమ బంగాలో ఒకరు మృతిచెందినట్లు సమాచారం. ఈశాన్‌, ఉత్తర భారతాన్‌ని వణికించింది. పశ్చిమ్‌బంగాలో భూకంపంతో బహుళ అంతస్తు భవనం కూలి ఒకరు మృతిచెందారు. జల్‌పయ్‌గురి జిల్లాలో భవనం కూలడంతో పాణ్యసింగరాయ్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉత్తర బంగాల్‌లో అనేక చోట్ల భూకంపం కారణంగా భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. రాష్ట్రంలో భూకంప పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అధికారులను ఆదేశించారు. నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా భారత్‌లో పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. సిక్కిం రాష్ట్రంలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. భూప్రకంపనలతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయోధ్య ప్రాంతంలో గల కామాఖ్యాదేవి ఆలయం కుప్పకూలింది. ఆలయం పైకప్పు కూలిపోయింది. దాంతో భక్తులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇది పురాత భవనం కావడంతో భవనంలోని చాలా భాగాలు కూలిపోయాయి. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటానికి తోడు.. భవనం కూడా పాతబడిపోవడంతో దాని పైకప్పు కూలిపోయిందని భావిస్తున్నారు. తర్వాత కొంతసేపటికి లోపలకు వెళ్లి, నష్టం ఏమాత్రం వాటిల్లిందన్న విషయాన్ని భక్తులు, ఆలయ పూజారులు పరిశీలించారు.మోడీ అత్యవసర భేటీ భారత ప్రభుత్వం నేపాల్‌కు  సహాయక బృందాలను పంపుతోంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఉత్తర,  ఈశాన్య భారతంలో  సంభవించిన భూకంపం ప్రమాదాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు.  భూకంప తీవ్రతపై అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ట్వీట్‌ చేశారు. నేపాల్లో  భూంకంప పరిస్థితిని  కూడా గమనిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. యూపీ, బీహార్‌, నేపాల్లో సంభవించిన భూకంపాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ  విపత్తునివారణ సంస్థను అడిగి వివరాలు తెలుసుకున్నారు.  భూకంప తీవ్రతపై అధికారులతో చర్చించారు. ఉత్తర భారతదేశంలో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ లోని చార్‌ ధామ్‌ యాత్ర నిలిచిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు యాత్రను నిలిపివేశారు. భూకంపం వల్ల ఉత్తరాఖండ్లోనూ భారీ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. భూకంపం కారణంగా ఎవరెస్ట్‌ పర్వతంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో 1, 2 బేస్‌ క్యాంపులు కొట్టుకుపోయాయి. పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్‌ పర్వతం విూద చిక్కుకుపోయారు. నేపాల్‌, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశంలో వచ్చిన భూకంపం కారణంగా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించేందుకు కొన్నాళ్ల ముందుగానే బయల్దేరిన పర్వతారోహకులు ఇప్పుడు అక్కడ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.