భారత్‌ అద్భుత ఇన్నింగ్స్‌

474 పరుగులకు ఆలౌట్‌

బెంగళూరు,జూన్‌15(జ‌నం సాక్షి ): అఫ్ఘాన్‌తో జరుగుతున్న చరిత్రాత్మక టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ అద్భుతంగా రాణించి తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించారు. ఓవర్‌నైట్‌ స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 347పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ మరో 127పరుగులు సాధించి ఆలౌటైంది. ఆరంభంలోనే అశ్విన్‌ వికెట్‌ చేజార్చుకున్నా.. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జడేజాతో కలిసి మరో బ్యాట్స్‌మెన్‌ హర్ధిక్‌ పాండ్య71 పరుగులతో ఇన్నింగ్స్‌ నడిపించాడు. ఈ క్రమంలో పాండ్య అర్ధశతకం పూర్తిచేసుకొని శతకం దిశగా అడుగులు వేశాడు. కానీ 99.2ఓవర్‌లో వఫాదర్‌ బౌలింగ్‌లో జజైయ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో హర్ధిక్‌ పోరాటానికి తెరపడింది. అనంతరం అఎ/-గాన్‌ బౌలర్లు జోరు కొనసాగించడంతో భారత్‌ 104.5ఓవర్లలో 474పరుగులు చేసి ఆలౌటైంది. చివర్లో ఉమేశ్‌ యాదవ్‌(26నాటౌట్‌తో కాసేపు మెరిపించాడు. ఎన్నో అంచనాలతో టెస్టు అరంగ్రేటం చేసిన అఫ్గానిస్థాన్‌ భారత్‌ జోరుకు క్లళెం వేయలేకపోయింది. తొలి రోజు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(107; 96బంతుల్లో ), మురళీ విజయ్‌(105; 153బంతుల్లో ) చెరో సెంచరీతో చెలరేగి స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌(54; 64బంతుల్లో ) కూడా రాణించాడు. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌గా రెండో రోజు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన హర్ధిక్‌ పాండ్య అర్ధశతకంతో దూకుడుగా ఆడటంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దక్కింది. ఇదిలా ఉండగా స్పిన్‌ బౌలింగే ప్రధాన ఆయుధంగా బరిలోకి దిగిన అఎ/-గాన్‌కు వారి నుంచి ఆశించినంత ఫలితం దక్కలేదు. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌, నబి బౌలింగ్‌ను భారత బ్యాట్స్‌మెన్‌ సులభంగా ఎదుర్కొన్నారు. ఇందులో రషీద్‌ ఖాన్‌ 35ఓవర్లు విసిరి రెండు వికెట్ల తీసి 154పరుగులు సమర్పించుకున్నాడు. కాగా చివర్లో ఇషాంత్‌ శర్మ వికెట్‌ తీసి భారత్‌ పోరాటానికి తెరవేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో పేసర్లు అహ్మద్‌జాయ్‌ మూడు వికెట్లు, వఫాదర్‌ రెండు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నారు.