భారత్‌ – ఆఫ్ఘనిస్థాన్‌ చర్చలు నాలుగు ఒప్పదాలపై సంతకాలు

ఢిల్లీ: ఆఫ్ఘనిన్థీన్‌ అధ్యక్షుడు హీమీద్‌ కర్జాయ్‌, భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు ఈరోజు ఇరుదేశాల  ప్రతినిధి బృందాల స్థాయిలో పలు అంశాలపై చర్చలు జరిపారు. ఆఫ్ఘనిస్ధాన్‌ భద్రతా దళాలకు శిక్షణ ఇచ్చే అంశంలో భారత్‌ పాత్ర పెంచడం గురించి ప్రధానంగా చర్చించారు. గనులు, యువజన వ్యవహారాలు, ఎరువులు, అభివృద్ధి పథాకాలకు సంబంధించి ఇరు దేశాలూ నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అనంతరం ఇరువురూ కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్థాన్‌ పునర్నిర్మాణానికి భారత్‌ సహకరిస్తుందని, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడు మరింత బలోపేతమవుతాయని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు.