భారత్ ఎ జట్టులో శ్రీశాంత్ చాన్నాళ్ల తర్వాత జట్టులోకి శ్రీ
ముంబై, జనవరి 3: ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కు భారత జట్టును ప్రకటించారు. 14 మందితో కూడిన జాబితాలో కేరళ స్పీడ్‌స్టార్ శ్రీశాంత్‌కు చోటు దక్కింది. చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమైన శ్రీశాంత్‌కు ఈమ్యాచ్ చక్కని అవ కాశంగా చెప్పొచ్చు. శ్రీ చివరిసారిగా 2011 ఇంగ్లాండ్ పర్యటనలో ఆడాడు. తర్వాత గాయం కారణంగా జట్టులో చోటు కోల్పో యాడు. అయితే గత ఏడాది చివర్లో రంజీ సీజన్ ఆడిన శ్రీశాంత్ మెరుగ్గా రాణించాడు. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు పడగొట్టడం తో భారత్ ఎ జట్టుకు ఎంపిక చేశారు. ఒకవేళ దీనిలో కూడా రాణిస్తే ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు ఎంపికయ్యే ఛాన్సుంది. ఇదిలా ఉంటే కొత్తగా జమ్మూ కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్‌కు చోటు దక్కింది. ఈ రంజీ సీజన్‌లో ప్రదర్శనకు గానూ సెలక్టర్లు అతనికి ప్రమోషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ తరపున ఆల్‌రౌండర్‌గా రసూల్ అదరగొడుతున్నాడు. ఈసీజన్‌లో బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణిం చాడు. మొత్తం రెండు సెంచరీలతో 594 పరు గులు చేశాడు. అలాగే 33 వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అతను జమ్మూ తరపున టాప్‌ప్లేస్‌లో నిలవడంతో సెలక్టర్లు పిలుపునిచ్చారు. అయితే గతంలో బెంగళూర్ చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన పేలుడుకు సంబంధించి అనుమానించబడిన రసూల్ తర్వాత క్లీన్‌చిట్ పొందాడు. కాగా భారత ఎ జట్టు కు అభినవ్ ముకుంద్ సారథ్యం వహించనున్నా డు. ఇక ప్రస్తుతం రంజీ క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఎనిమిది జట్ల నుండీ ఒక్క ఆటగాడికీ దీనిలో చోటు దక్కకపోవడం విశేషం. ఐదు వన్డేల సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టు భారత్ ఎతో జనవరి 6న ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ ఆడనుంది.