భారత్-చైనా యుద్ధ అమర వీరులకు తొలిసారి నివాళి
ఢిల్లీ: భారత్-చైనా యుద్ధంలో అమరులైన జవాన్ల స్మృతి చిహ్నం వద్ద కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ సైనికాధికారులతో కలిసి శ్రద్థాంజలి ఘటించారు. 1962లో జరిగిన ఈ యుద్ధంలో వీర మరణం పొందిన వారికి ప్రభుత్వం తరపున నివాళులు అర్పించడం ఇదే మొదటిసారి, రక్షణ శాఖ సహాయ మంత్రి పల్లంరాజు, ముగ్గురు సైనికాధికారులతో కలిసి వచ్చిన ఆంటోని.. ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతి వద్ద నివాళులు అర్పించారు. చైనాతో ఉన్న సరిహద్దు సమస్యలను తెలియజేశారు. ఇండియా-చైనా యుద్ధంలో మూడు వేల మందికిపైగా భారత జవాన్లు చనిపోయారు.