భారత్‌ టెక్నాలజీలో న్యూజిలాండ్‌ భాగస్వామ్యం కావాలి

55412233
– ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 26(జనంసాక్షి): భారత్‌ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌ కీతో భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ టెక్నాలజీ రంగంలో భారత్‌తో న్యూజిలాండ్‌ భాగస్వామ్యం కావాలని అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడాలని మోదీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పలుకీలక ఒప్పందాలు జరిగాయి. న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌లో భారత్‌ సభ్యత్వానికి న్యూజిలాండ్‌ మద్దతిస్తున్నందుకు జాన్‌ కీకి ధన్యవాదాలు తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ, ఉగ్రవాదంపై పోరులో కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌ వద్ద జాన్‌కీకి ఘన స్వాగతం లభించింది. అక్కడ జాన్‌ కీ గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌

స్వీకరించారు. అనంతరం రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్ముడికి ఆయన నివాళులర్పించారు. హైదరాబాద్‌ హౌజ్‌లో ఇరువురు కలసి మాట్లాడారు.