భారత్‌ పాకిస్తాన్‌ల యుద్ధం మంచిదికాదు

srilanhka-primeminister-oct
– అలాంటి పరిస్థితి రాకపోవచ్చు

– శ్రీలంక ప్రధాని

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 5(జనంసాక్షి): భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరుగుతుందని తాను భావించడం లేదని శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమ్‌సింఘే అన్నారు. దక్షిణాసియాలో

భారత్‌కు ప్రత్యేక స్థానం ఉందని, ఉద్రిక్తతలను నివారించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఉడీ ఉగ్రదాడి, పాక్‌లో భారత్‌ సర్జికల్‌ దాడుల అనంతరం ఇరు దేశాల

మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లంక ప్రధాని వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.భారత పర్యటనకు వచ్చిన విక్రమ్‌సింఘే బుధవారం ఏఐసీసీ అధినేత్రి సోనియా

గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరాదంటూ పాకిస్థాన్‌ పేరు ప్రస్తావించకుండా చెప్పారు. సార్క్‌ సమావేశంలో ఈ అంశం ప్రధాన అజెండా అవుతుందని చెప్పారు. భారత్‌, శ్రీలంకలకు ప్రస్తుతం కీలకమైన సమయమని, కలసి పనిచేస్తామని పేర్కొన్నారు.ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం భారత్‌.. పాకిస్థాన్‌లో జరగాల్సిన సార్క్‌ సదస్సును బాయ్‌కాట్‌ చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో పాటు దక్షిణాసియా దేశాలు

భూటాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌, మాల్దీవులు.. భారత్‌కు బాసటగా నిలిచి సార్క్‌ సదస్సును బహిష్కరించాయి.