భారత్ జోడోయాత్ర సజావుగా సాగాలని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

భారత్ జోడోయాత్ర సజావుగా సాగాలని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర నిర్వహించారు! భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్ 9 జనం సాక్షి: జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాజీవ్ గాంధీ చేపట్టిన భారత్ జోడు యాత్ర సజావుగా సాగాలని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడినుండి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నీ వాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితే ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సత్యనారాయణ రావులు హాజరై వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కాపటనాటకాలను తెలంగాణ ప్రజలు చూస్తున్నారని అన్నారు. గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటే విధంగా పెరిగాయన్నారు. ధరలు పెంచి పేద ప్రజల ఉసురుతీస్తున్నారని వారన్నారు. రాజీవ్ గాంధీ, సోనియా నాయకత్వం వర్ధిల్లాలని కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు  చేపట్టారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వెంపటి భువనసుందర్, కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్, భూపాల పల్లి అర్బన్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవా, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అప్పల శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు సమ్మయ్య నాయక్, అధికార ప్రతినిధి అజ్మీరా జంపయ్య, రజినీకాంత్, పుప్పాల రాజేందర్, కార్పొరేటర్ శ్రీనివాస్, మై రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.