భారత్ జోడో యాత్ర లో పాల్గొనండి
— పాలమూర్ యునివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టి నేతలు
మహబుబ్ నగర్ ,అక్టోబరు 18 (జనంసాక్షి ):
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తెలంగాణ రూట్ మ్యాప్ ఇదివరకె ఖరారైంది. టీపీసీసీ ఆధ్వర్యంలో రూపొందించిన పాదయాత్ర రూట్ మ్యాప్‌కు ఏఐసీసీ ఆమోదం లభించిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు .మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెలలో చేరుకుంటున్న సందర్భంగా పాలమూర్ యునివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మికాంత్ రాథోడ్ ను మాజీ ఎంపీ టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి , జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ , డిసిసి జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కోత్వల్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుసూదన్ రెడ్డి , వైస్ ఛాన్సలర్ ను భారత్ జోడో యాత్ర లో పాల్గోలని కోరారు.. ఈ రూట్ మ్యాప్ ప్రకారం రాహుల్ గాంధీ.. కర్ణాటక నుంచి నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తారు.అక్కడినుంచి మక్తల్, మహబూబ్‌నగర్ టౌన్, జడ్చర్ల, షాద్‌నగర్‌ల మీదుగా యాత్ర శంషాబాద్ చేరుకుంటుంది.