భారత్-మెక్సికో బంధం మరింత బలపడాలి

modi-resta1ఎన్‌ఎస్‌జీ చేరేందుకు మద్దతు తెల్పిన మెక్సికో ప్రెసిడెంట్‌కు కృతజ్ఞతలు చెప్పారు ప్రధాని మోడీ. మెక్సికోలో పర్యటిస్తున్న ప్రధాని.. ఆ దేశ అధ్యక్షుడితో కలిసి జాయింట్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల అభివృద్ధికి భారత్‌ ఎప్పుడు కృషి చేస్తుందని, స్పేస్‌ మరియు సైన్స్‌ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలకు తమ సహకారం అందిస్తామన్నారు మోడీ. ఐటీ, ఎనర్జీ, ఫార్మా రంగాల్లో ఇరు దేశాల మధ్య లావాదేవీలు జరగాలన్నారు. భారత్-మెక్సికో బంధం మరింత బలపడాలని పెరగాలి మోడీ ఆకాంక్షించారు.

ప్రధాని మోడీకి మెక్సికో అధ్యక్షుడి సర్‌ప్రైజ్

మెక్సికో దేశాధ్యక్షుడు ఎన్రిక్ పీనా నీటో భారత ప్రధానిని సర్ ప్రైజ్ చేశాడు. మెక్సికో సిటీలోని ఓ ఫేమస్ రెస్టారెంట్ కు మోడీని తీసుకెళ్లారు. స్వయంగా ఆ దేశాధ్యక్షుడే కారును కూడా డ్రైవ్ చేశారు. నీటో ఇచ్చిన విందుకు మోడీ సర్ ప్రైజ్ అయ్యారు. సిటీలో ఫేమస్ రెస్టారెంట్ క్వింటోనిల్ లో దేశాధినేతలిద్దరూ బీన్ టాకోస్ విందు ఆరిగించారు. బీన్ టాకోస్ ఓ శాకాహార భోజనం. టాకోస్ రొట్టెలను మొక్కజొన్న లేదా గోధుమ పిండితో చేస్తారు. మోడీ కోసం దేశాధ్యక్షుడు నీటో.. బీన్ టాకోస్ డిష్ ను అందించారు.