భారత్ లో అణు బాంబు పితామహుడు కలాం

మిర్యాలగూడ. జనం సాక్షి
భారతదేశంలో మొట్టమొదటగా అణు బాంబులను  ప్రవేశపెట్టి అమలు పరిచిన పితామహుడు, ప్రపంచ మేధావి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ అని బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు అన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలో అనేక అణు విధానాలను ప్రవేశపెట్టి దేశ అభివృద్ధికి పాటుపడరన్నారు. ప్రపంచ దేశాల్లో భారత దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. నేటి యువతకు ఆదర్శనీయుడుతో పాటు అనేక అంశాలు మార్గదర్శిగా నిలిచాడని పేర్కొన్నారు. కలాం సేవలను దేశం ఎప్పటికి మరువదని తెలిపారు. ఆయన ఆశయాలు అమలు చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు జయరాజు ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అంజయ్య, లైబ్రేరియన్ సుధాకర్ మైనారిటీ సంఘం జిల్లా నాయకులు మోసిన్ అలీ వడ్డెర సంఘం జిల్లా నాయకుడు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు