భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
చేవెళ్ల అక్టోబర్ 15 (జనంసాక్షి) భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం శనివారం ఘనంగా జరిగాయి. 91వ జయంతిని పురస్కరించుకుని చైర్మన్ ఆధ్వర్యంలో కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి మాట్లాడుతూ… తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం భారత అణురంగంలో అత్యున్నతస్థాయికి చేరి అనేక సేవలు అందించిన గొప్ప శాస్త్రవేత్త అని అన్నారు. అలాగే ఆయన రాష్ట్రపతిగా దేశానికి సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలోని… వైస్ చైర్మన్ బి. నరసింహులు, పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, దేవర సమత, డైరెక్టర్లు: కృష్ణ, మహేష్,వెంకటేష్, తిరుపతిరెడ్డి,వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్,చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణ నాయక్, తదితరులు పాల్గొన్నారు.