భారత స్వాతంత్ర్యం ఇతర దేశాలకు ఆదర్శం
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన విధానం ఇతర దేశాలకు ఆదర్శమని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం అల్ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ చేపట్టారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ నుండి ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీని నరేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశం పలు సంస్కృతి సాంప్రదాయలకు నిలయమని అన్నారు. విభిన్న జాతులకు , కులాలకు , మతాలకు సమ ధర్మం పాటిస్తుందని వెల్లడించారు. తద్వారా సమాజంలో ఎటువంటి ఆటంకం లేకుండా అభివృద్ధిని శరవేగంగా సాధిస్తున్నామని పేర్కొన్నారు. ఇతర దేశాలకు అపన్న హస్తం అందించడంలో ముందున్నారని తెలిపారు. భారతదేశం అవలంబిస్తున్న పలు పోరాట పద్దతులు స్వాతంత్య్ర సమరయోధులు నిర్దేశించిన నియమనిబంధనలు మీద ఆధారపడి ఉన్నవని గుర్తు చేశారు. ప్రతి పౌరుడు స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకోని ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకొని ఉత్తమంగా ఉండాలని సూచించారు . ప్రతి విద్యార్థికి భారతస్వాతంత్ర్య పోరాట తీరును తెలియజేయడానికై పోరాట వీరుల గురించి చెప్పడానికి నేడు నగరంలో పాఠశాల విద్యార్థులచే దేశభక్తిని చాటేవిధంగా, జాతీయభావాన్ని ఇనుమడింపజేసే విధంగా తిరంగా ర్యాలీని సుమారు 2000 కు పైగా విద్యార్థులతో ఘనంగా నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. ఈ ర్యాలీని పాఠశాల నుండి కోర్టు చౌరస్తా, ఆర్.ఎన్.బి. చౌరస్తా, తెలంగాణ చౌక్ వరకు చేపట్టడం జరిగిందని చెప్పారు. ర్యాలీలో విద్యార్థులు భారత్ మాతా కి జై , మహాత్మాగాంధీకి జై జవాన్, జై కిసాన్ నినాదాలు చేస్తూ దేశభక్తిని రెట్టింపు చేశారు అన్నారు. సుమారు 180 పైగా మంది విద్యార్థులు వివిధ దేశనాయకుల వేశాధారణలో ఊరేగింపుకు వన్నె తెచ్చారు . ఈ వేడుకలో జిల్లాలోని అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ , బోధన సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.