భారీకెడ్లను బద్దల కొట్టి.. కదం తొక్కిన జిపి కార్మికులు..

జిపి కార్మికుల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం.

అదనపు కలెక్టర్ జోక్యంతో శాంతించిన కార్మికులు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 31.(జనంసాక్షి). శాంతియుతంగా జరుగుతున్న గ్రామపంచాయతీ కార్మికుల ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు పోలీసులు ఏర్పాటుచేసిన భారీ కేట్లను కార్మికులు బద్దలు కొట్టుకొని కలెక్టరేట్లోకి చోచ్చుకుపోవడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జోక్యంతో కార్మికులు శాంతించారు. సోమవారం జిల్లాలోని అన్ని మండలాల నుండి గ్రామపంచాయతీ కార్మికులు భారీగా కలెక్టరేట్ కు తరలివచ్చారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైటయించి ఆందోళన చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగింది. అధికారుల నుండి స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన జిపి కార్మికులు పోలీసులు ఏర్పాటుచేసిన భారీ కేట్లను ఛేదించుకొని కలెక్టరేట్ లోకి పోయే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తోపులాటలు సిఐటియు నాయకులు కోడం రమణ స్వల్పంగా గాయపడ్డారు. ఒక్కసారిగా కార్మికులంతా బారికేట్లను చూసుకుంటూ కలెక్టరేట్ లోకి చోచ్చుకు వెళ్లారు. కలెక్టరేట్ గేటు ముందు బైటయించి ఆందోళన చేపట్టారు. సిఐటియు నాయకులతోపాటు పలువురు గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు అదనపు కలెక్టర్ కు పరిస్థితి వివరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు కృష్ణవేణి, జిల్లా అధ్యక్షులు మల్యాల నరసయ్యతో పాటు పలువురు సిఐటియు నాయకులు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు సన్మానం చేయడం తో సరిపోదని తక్షణమే గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ల ముందు ఆందోళనలు చేస్తున్నామని అన్నారు.పలువూరు బీఎస్పీ నాయకులు ఇస్తాదారుల సంఘం నాయకులు కార్మికుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. నిరసన కార్యక్రమంలో బుర శ్రీనివాస్, మల్లయ్య, లక్ష్మణ్, రవి,సిఐటియు నాయకులు ఎల్లారెడ్డి, మూసం రమేష్, ఎంపీటీసీ మల్లారం అరుణ్, మోర అజయ్ తో పాటు అన్ని మండలాల నుండి భారీ సంఖ్యలో గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

తాజావార్తలు