భారీ మెజార్టీతో గెలిపించాలి

బాలూనాయక్‌కు మద్దతుగా ప్రచారం

నల్లగొండ,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా ఎన్నికల బరిలోకి వచ్చిన తెరాస అభ్యర్థులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు సిరాజ్‌ఖాన్‌ కోరారు. శనివారం మండల కేంద్రంలో ప్రజాకూటమి నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, తెజెస నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి దేవరకొండ కాంగ్రెస్‌ అభ్యర్థి బాలునాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ డా.వేణుధర్‌రెడ్డి, పస్నూరి యుగేందర్‌రెడ్డి, గంధం సురేష్‌, లింగంపల్లి వెంకటయ్య, ఉట్కూరి వేమన్‌రెడ్డి, ఖైసర్‌ఖాన్‌, మూఢావత్‌ పాండునాయక్‌, కుంభం శ్రీనివాస్‌గౌడ్‌, కోట్ల జగదీష్‌, కొడిదాల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.