భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రేడింగ్ తో పాటూ ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన ఉర్జిత్ పటేల్ పై ఇన్వెస్టర్లు భారీ అంచనాలు పెంచుకున్నారు. దాంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ సూచీ సెన్సెక్స్ 272 పాయింట్ల లాభంతో 28 వేల 802 దగ్గర ట్రేడవుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 81 పాయింట్ల లాభంతో 8 వేల 890 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 66గా కొనసాగుతుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, లీడ్, యాక్సిస్ బ్యాంక్, క్రూడ్ ఆయిల్ పామ్, పీఎన్‌బీ, సిల్వర్, అశోక్ లేలాండ్ తదితర కంపెనీల షేర్లు లాభాలబాటలో పయనిస్తుండగా ఐడియా సెల్యూలార్, అల్యూమినియం, హెచ్‌సీఎల్ టెక్, నేచురల్ గ్యాస్ వంటి కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.