భారీ వర్షాల కారణంగా నేలమట్టం అయిన వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

  సిపిఐ  మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు
గరిడేపల్లి, అక్టోబర్ 16 (జనం సాక్షి): గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొట్టకు వచ్చిన వరి పైర్లు మొత్తం నేల మట్టం అయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ప్రభుత్వం వెంటనే అధికారులతో సర్వే చేయించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని అనేక గ్రామాలలో సిపిఐ మండల కమిటీ పర్యటించి పడిపోయిన వరి పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను ఓదార్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే దశలో వరి పైర్లు నేల వాలయని రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని ఈ పరిస్థితిలో ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే  రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. యుద్ధ ప్రాధి పధిక మీద ప్రభుత్వం అధికారుల చేత సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జోనలగడ్డ తిరపయ్య, ఏఐవైఎఫ్ మండల కన్వీనర్ పంగ సైదులు, మెండే లింగరాజు,వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు రెడిపంగు సైదులు, తాళ్ల తిరపయ్య, రైతులు అర్తి నర్సింహారావు, జోనలగడ్డ వెంకటేశ్వర్లు, కర్నె సైదిరెడ్డి, గోధుమల వెంకటేశ్వర్లు, అచ్చయ్య,మంజుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Attachments area