భార్య నోట్లో పురుగుల మందు పోశాడు
ఖమ్మం : ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, పడమట నర్సాపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కొట్టి ఆపై నోట్లో పురుగు మందు పోశాడో భర్త. వివరాలు … గ్రామానికి చెందిన బూరుగు నర్సమ్మ(32), ముక్తేశ్వరరావు భార్యాభర్తలు. ముక్తేశ్వర రావు బుధవారం రాత్రి మద్యం తాగి భార్యను కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె నోట్లో పురుగుమందు పోశాడు. కొన ఊపిరితో ఉన్న నర్సమ్మను స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఆమె మరణించింది. దాంతో ఆగ్రహించిన నర్సమ్మ తరపు బందువులు ముక్తేశ్వరరావుకు దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.