భాస్వరాన్ని కరిగించెబ్యాక్టీరియాతొ లాభాలు-ఎం భరత్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లోని
 వెల్టూర్ గ్రామంలో సాలుబ లైసింగ్ బాక్టీరియా – భాస్వరాని కరిగించే బాక్టీరియా) తో విత్తన శుద్ధి కోసిరెడ్డి. భాస్కర్ రెడ్డి పొలం లో సంబంధిత వ్యవ సాయ విస్తరణ అధికారి M. భరత్ కుమార్ అవగాహన కల్పించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది
పియస్బీ – భాస్వారాని కరిగించే బాక్టీరియా ద్వారా అందుబాటులో లేని భాస్వారని అందుబాటులో కి తీసుకురావడానికి ఈ బాక్టీరియా ఉపయోగ పడుతుంది అని సూచించడం జరిగింది.
పియస్బీ నీ ఎకరానికి సరిపడే విత్తనానికీ 200 మీ. లీ  ధ్రావ జీవన ఎరువును లేదా 200 గ్రాముల ఘన జీవన ఎరువును 10 శాతం చెక్కర కలిపిన మిశ్రమాన్ని  పట్టించి ఒక అరగంట సేపు నీడలో ఆరబెట్టి 24 గంటల లోపు నాటుకోవాలని సూచించడం జరిగింది
పీయస్బీ నీ భూమిలో వాడడానికి ఎకరాకి 2 కీలోలు ఘన జీవన ఎరువును లేదా 200 మీ. లీ  ధ్రవ జీవన ఎరువును సుమారుగా 100-200 కిలోల పశువుల ఎరువు తో గానీ వెర్మి కంపోస్ట్ తో కలిపి వేసుకోవాలి అని సూచించడం జరిగింది
 పీయస్బి నీ వాడడం ద్వారా ఒక హెక్టారికీ ఒక బస్తా డిఎపీ నీ ఆధా చేసుకోవచ్చు అనీ సూచించడం జరిగింది..
 రైతులు అందరు పియస్బీనీ వాడడం అలవాటు చేసుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో భాగంగా భాస్కర్ రెడ్డి, అభీతేజ్ రెడ్డి, హైమవతి, విశ్వేశ్వర రెడ్డి తది తరులు పాల్గొన్నారు