భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక తెలంగాణ

ది ముమ్మాటికీ జాతీయ సమైక్యతా దినోత్సవమే

విచ్ఛిన్నానికి బిజెపి కుట్ర

వారికీ చరిత్ర తెలీదు

యావత్ దేశానికి ఆదర్శం కావాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం

ఆందులో భాగమే వజ్రోత్సవ వేడుకలు

జాతీయ సమగ్రతకు మార్గదర్శనం సీఎం కేసీఆర్

– మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట (జనంసాక్షి): కులాల పేరుతో, మతాల పేరుతో విచ్ఛిన్నానికి బిజెపి కుట్రలకు తెర లేపుతుందని , ఆ ఉచ్చులో తెలంగాణా సమాజం పడొద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.సెప్టెంబర్ 17న జరుపుకునేది ముమ్మాటికీ జాతీయ సమైక్యతా దినోత్సవమేనని స్పష్టం చేశారు.చరిత్ర తెలియని వారు వక్రీకరించి చెప్పే బాష్యాలు మనలో మనకు తగవులు పెట్టేందుకేనని చెప్పారు.నేడు కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ సమగ్రతా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున సమగ్రతా ర్యాలీని నిర్వహించారు.జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీని ఆయన ప్రారంభించారు.అనంతరం పిఎస్ఆర్ సెంటర్ లో ర్యాలీ ముగింపు సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు.భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణా ప్రతీక అని అది యావత్ భారతదేశానికి చాటి చెప్పేందుకే సీఎం కేసీఆర్ స్వాతంత్ర్యం సిద్దించి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారని అన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు ఇక్కడ సోదర భావంతో కలిసిపోయారని చెప్పారు1948 లొనే ఇక్కడికి వచ్చిన మహాత్మాగాంధీ ఇక్కడి సంస్కృతి గురించి వర్ణిస్తూ గంగా,జమునా తహజీబ్ లకు హైదరాబాద్ రాష్ట్రం పెట్టింది పేరు అంటూ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.అంతే గాకుండా ఇప్పటికీ ఇక్కడ అది రంజాన్ అయినా, క్రిస్మస్ అయినా , బతుకమ్మ, దసరా పండుగైనా కలిసి మెలసి జరుపుకునే సంస్కృతి ఫరీడవిల్లుతుందన్నారు.అదే సంస్కృతి యావత్ భారతదేశానికి ఆదర్శంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు.అందులో భాగమే వజ్రోత్సవ వేడుకలని తెలిపారు.సహజ వనరుల భాగస్వామ్యంతోటే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.కలిసి ఉంటేనే పురోగతిని సాధించవచ్చని గట్టిగా నమ్మే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు.విడిపోయినప్పుడే విదేశీయులు భారతదేశం మీద దండ యాత్రలు కొనసాగించారన్నారు.మన దేశ భూభాగంలో కానీ,దేశ జనాభాలో కానీ ఒకటో వంతు కుడా లేని ఫ్రెంచ్,డచ్,పోర్చ్ గీస్ వంటి దేశాలు కానీ వ్యాపారం పేరుతో దేశాన్ని ఏలిన బ్రిటీష్ వారు జరిపిన దండయాత్రలు అందుకు నిదర్శనమన్నారు.వర్ణ వ్యవస్థ, కులాల పేరుతో విభజన అందులో భాగమే నన్నారు.చదువుకునే అవకాశం కల్పించక, చదువుకు దూరం చేసిన విదేశీయులు దేశాన్ని ఎలారన్నారు.వీటన్నింటి మీద పోరాట ఫలితమే దేశానికి స్వాతంత్య్రమని తెలిపారు784 సంస్థానాల విలీనంతో అఖండ భారతం ఆవిర్భావం జరిగిందన్నారు.నాటి ప్రధాని దివంగత పండిట్ జవహర్ లాల్ నెహ్రు చొరవ తోటే హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసిందన్నారు.వర్తమానానికి చరిత్రను తెలియ జెప్పేందుకే సీఎం కేసీఆర్ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారన్నారు.జాతీయ సమగ్రతకు తెలంగాణ మార్గదర్శనం కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ , జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,
జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ , ప్రజాప్రతినిధులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.