భూకంపం మృతుల కుటుంబాలకు రూ. 6 లక్షలు నష్టపరిహారం

ప్రధాన మంత్రి అత్యవసర సహాయ నిధి నుంచి
న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 26 (జనంసాక్షి):
ప్రకృతి విపత్తుల వల్ల చనిపోయినవారి కుటుం బాలకు ఇప్పటివరకు చెల్లిస్తున్న నష్టపరిహారం మొత్తాన్ని రూ. 1.5 లక్షల నుంచి రూ. 4 లక్ష లకు పెంచుతూ నిబంధనలు సవరించారు. ప్రధా న మంత్రి అత్యవసర సహాయ నిధి నుంచి మరో రూ. 2 లక్షలు కలిపి మొత్తం రూ. 6 లక్షల పరి హారాన్ని మృతుల కుటుంబాలకు అందించ నున్నట్లు పీఎంవో తెలిపింది. భూకంపంతో తీ వ్రంగా నష్టపోయిన నేపాల్‌ లో భారత్‌ కు చెం దిన పలు సంస్థలు చేపట్టిన సహాయక చర్యలను ప్రధాని సవిూక్షించారన, ఆహారం, నీరు, పాల పొడి వంటి అత్యవసరాలను బాధితుల వద్దకు వేగంగా చేరవేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌, రాజ్‌ నాథ్‌ సింగ్‌, మనోహర్‌ పారికర్‌, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్‌ దోవల్‌, క్యాబినెట్‌ సెక్రటరీ అజిత్‌ సేథ్‌ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.