భూనిర్వాసితులకు అన్యాయం తగదు

సంగారెడ్డి అర్బన్‌: రాజీవ్‌ రహదారి విస్తరణలో భూనిర్వాసితులకు అన్యాయం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని డీబీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌ లక్ష్మీ ఆరోపించారు. సోమవారం స్థానిక ఐబీలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.ఏడాది దాటినా రైతులకు పరిహరం అందడంలేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు డీబీఎఫ్‌ వారి పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.నాయకులు శంకర్‌, గంగేరి శ్రీనివాస్‌,నిరుడి దుర్గవ్‌,జైపాల్‌నాయక్‌,రాజేందర్‌ నాయక్‌,నారాయణ,మల్లేశం,తదితరులు పాల్గొన్నారు.