భూపంపిణీ పథకానికి భూములు ఇవ్వాలి

సంగారెడ్డి,ఏప్రిల్‌25

ఎస్సీల కోసం మూడెకరాల భూపంపిణీ కింది  జిల్లా వ్యాప్తంగా భూమిని ఎంపిక చేశామని జెసి అన్నారు.  ఆయా గ్రామాల్లో సాగుకు అనుగుణంగా ఉన్న భూమిని అమ్మేందుకు ఎవరు ముందుకు వచ్చినా తీసుకుంటామని అన్నారు. వరాఇకి సరైతన ధరలు చెల్లించి తీసుకుంటామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా భూమి కొనుగోలు చేయడానికి నిధులు  మంజూరయ్యాయన్నారు. ఇప్పటికే భూమి కొనుగోలుకు అవసరమైన వెచ్చించామన్నారు. ఎస్సీలకు ప్రభుత్వం ఇచ్చే మూడెకరాల భూమిని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని జెసిహెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చే భూమిని సాగు చేసుకొని అభివృద్ధి చెందాలని అబ్దిదారులతో అన్నారు.  ప్రాంతాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నామన్నారు. భూ పంపిణీ కోసం ఎంపిక చేసిన భూమిని ఆయన పరిశీలించారు. దళితుల సంక్షేమం కోసమే ప్రభుత్వం మూడెకరాల భూపంపిణీ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. గ్రామసభ ద్వారా భూపంపిణీ కోసం ఎంపిక చేసిన వారికి పంపిణీ చేయడానికి రెవెన్యూ సిబ్బంది  గుర్తించిన భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగుకు యోగ్యమైన భూమినే గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ నిర్దేశిత ధరకు భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. వ్యవసాయం చేయలేకుండా ఉన్నవారు సైతం ఈ పథకం కింద భూమిని అమ్మవచ్చన్నారు.