భూమి కబ్జా చేసినవారిపై కేసు నమోదు చేయాలి
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 20, ( జనం సాక్షి ) : డివిజన్ కేంద్రంలోని మినీట్యాంక్ బాండ్ గా ఏర్పా టు చేసిన పుట్టలమ్మ కుంట భూమిఅన్యాక్రాంతం అవుతుందని, కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జాకు పాల్పడుతున్నారని, కబ్జాకు పాల్పడ్డా వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరం గా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ డిమాండ్ చేశారు. కబ్జాకు పాల్పడ్డా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డివిజన్ కేంద్రం లోని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజే శారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్ట లమ్మ కుంట చుట్టు పక్కల భూమి గజానికి 20 వేల చొప్పున విలువ ఉందని అట్టి భూమిని కొంద రు నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు అని అన్నారు.ఇప్పటికైనా స్థానికఎమ్మెల్యే డాక్టర్ తాటి కొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకొని సంబంధిత అధికారులకు చెప్పి కబ్జాకు పాల్పడ్డా వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ ఓబిసి సెల్ మండల అధ్యక్షుడు చల్ల తిరుపతి,యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యద ర్శి కోరుకోప్పుల మధు,కాంగ్రెస్ మండల నాయకు లు మామిండ్ల శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, భూక్య అరుణ్, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.